Posts

నేటి జనులు / నెటిజన్లు

ఈర్ష.. మన మనలో చాలా మందికి ఒప్పుకోవడం కష్టమే అయినా, మనం ప్రస్తుతం ఉంటున్న సమాజాన్ని నడిపిస్తున్న ఒక బలమైన emotion. ఏంటి నమ్మడం లేదా? facebook, instagram, youtube లాంటి సామాజిక మాధ్యమాలలో మనం రోజూ పని కట్టుకొని ఎక్కువగా చూసే పోస్ట్లు ఎందుకు చేస్తున్నామో ఒక్క సారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం.  - ఎప్పుడో మనం చడ్డీలు వేసుకునే టైం లో మన క్లాసులో వెనక బెంచి గాడికి google లో ఉద్యోగం వచ్చిందా! అసలు వాడికి అంత సీను ఉందా? - కాలేజీలో తలకి ఎప్పుడు నూనె రాసుకుని, చుడీదార్లు వేసుకుంటూ, ఎవరితోను మాట్లాడకుండా ఉండే ఈ అమ్మాయి ఇప్పుడు influencer అయిపోయిందా!? - నిన్న మొన్నటి దాకా వెయ్యి subscribers కూడా లేని దీని ఛానల్ ఇప్పుడు 500k దాటిపోయిందా!? కొత్త ఇల్లు home tour వీడియో కూడా చేసినట్టుందే! ఎంతైనా పెళ్లి అయ్యాక దీని దశ తిరిగిపోయింది. exactగా ఇవే కాకపోయినా, కొంచెం అటు ఇటుగా ఇలాంటి dialogues మనం మనసులో ఎప్పుడో ఒకప్పుడు అనుకొనే ఉంటాం. ఇవి కేవలం sample మాత్రమే. ఇంకా, అమ్మాయిల ఫోటోలకి like కొట్టి comment చెయ్యడమే తమ జీవిత లక్ష్యం అయినట్టు పాటు పడే యువ రత్నాలు; తాము తుమ్మినా దగ్గినా ప్రపంచానికి చాటి చెప్ప...